శ్రీయలమేల్మంగఁ జిరకృపాపాంగఁ
గాయజుఁ గనతల్లిఁ గాంతామతల్లి,
శ్రీవేంకటేశుఁ బోషితపద్మ కోశు
సేవకపరతంత్రు జిషితదైత్యతంత్రు,
దనుజకర్శనము మాధవ సుదర్శనము,
నినుకోటితేజంబు హేతిరాజంబు,
నరహరిసంకీర్తి నవనిధు లొసఁగు-
పరమోపకృతిఁ దాళ్ళపాకాన్నయ్యార్యు-
నాచారవిజితామరాచార్యుఁ దిరుమ-
లాచార్యు ఘన మదీయాచార్యుఁ గొలిచి
యార్యులు విని యన్నాచార్యవర్యు-
చర్యకు మిగుల నాశ్చర్యంబుఁ జెంద,
జలజాతవాసిని చనుఁబాలపుష్టిఁ
జలకెద నా నేర్చుపరిపాటి నిపుడు,
జననపంరంపరా శతసహస్రముల
వెనుకకు మేము దుర్విషయానురక్తిఁ
గుక్షింభరులమైన కొదవెల్లఁ దీఱ
రక్షించి, మాయపరాధము ల్మఱచి
యేపుట్టువున మిమ్ము నెఱుఁగంగఁజేసి
నీపాలివారిఁగా నియమించి మమ్ము
హరి ! మిమ్మునే కొనియాడు మా జిహ్వ
నొరులను గొనియాడకుండంగఁజేసి
కంటులేనట్టు లక్ష్మణగురు మతము-
వంటి సన్మతము మీవంటి దైవతము
తనవంటి గురుని నందఱలోనఁ దెచ్చి
వనజాక్ష! నేఁడు మావంటివారలకుఁ
గరతలామలకంబుఁ గావించెఁ గనుక
అరయఁగఁ దాళ్ళపాకన్నయాచార్యు -
పరమోపకార మెప్పటికి డెందమున
నరయచుఁ గొనియాడు టది యెుప్పుఁగనుక ,-
నాయనఁ జూచి మాయపరాధకోటు -
లేయెడఁ దలఁచక యెడఁబాయ కెపుఁడు-
నే యాపదలు మమ్ము నెనయక యుండ
మా యిలువేల్పవై మన్నించుకతన,
నందను సద్వర్తనము తండ్రి ప్రియము-
నొందఁ గీర్తించుట యుచితంబు గనుక,
అఱలేక, యీ యన్నమాచార్యచరిత
వెఱవక నీకు నే విన్నవించెదను ;
మన్నించి యలమేలుమంగతో నీవు
నిన్నుఁ బాయని భక్తనికరంబుతోడ
నవధారు శ్రీవేంకటాచలాధీశ !
అవధరింపుఁడు గురుహరిభక్తులార ;
శ్రీయలమేల్మంగఁ జిరకృపాపాంగఁ
గాయజుఁ గనతల్లిఁ గాంతామతల్లి,
శ్రీవేంకటేశుఁ బోషితపద్మ కోశు
సేవకపరతంత్రు జిషితదైత్యతంత్రు,
దనుజకర్శనము మాధవ సుదర్శనము,
నినుకోటితేజంబు హేతిరాజంబు,
నరహరిసంకీర్తి నవనిధు లొసఁగు-
పరమోపకృతిఁ దాళ్ళపాకాన్నయ్యార్యు-
నాచారవిజితామరాచార్యుఁ దిరుమ-
లాచార్యు ఘన మదీయాచార్యుఁ గొలిచి
యార్యులు విని యన్నాచార్యవర్యు-
చర్యకు మిగుల నాశ్చర్యంబుఁ జెంద,
జలజాతవాసిని చనుఁబాలపుష్టిఁ
జలకెద నా నేర్చుపరిపాటి నిపుడు,
జననపంరంపరా శతసహస్రముల
వెనుకకు మేము దుర్విషయానురక్తిఁ
గుక్షింభరులమైన కొదవెల్లఁ దీఱ
రక్షించి, మాయపరాధము ల్మఱచి
యేపుట్టువున మిమ్ము నెఱుఁగంగఁజేసి
నీపాలివారిఁగా నియమించి మమ్ము
హరి ! మిమ్మునే కొనియాడు మా జిహ్వ
నొరులను గొనియాడకుండంగఁజేసి
కంటులేనట్టు లక్ష్మణగురు మతము-
వంటి సన్మతము మీవంటి దైవతము
తనవంటి గురుని నందఱలోనఁ దెచ్చి
వనజాక్ష! నేఁడు మావంటివారలకుఁ
గరతలామలకంబుఁ గావించెఁ గనుక
అరయఁగఁ దాళ్ళపాకన్నయాచార్యు -
పరమోపకార మెప్పటికి డెందమున
నరయచుఁ గొనియాడు టది యెుప్పుఁగనుక ,-
నాయనఁ జూచి మాయపరాధకోటు -
లేయెడఁ దలఁచక యెడఁబాయ కెపుఁడు-
నే యాపదలు మమ్ము నెనయక యుండ
మా యిలువేల్పవై మన్నించుకతన,
నందను సద్వర్తనము తండ్రి ప్రియము-
నొందఁ గీర్తించుట యుచితంబు గనుక,
అఱలేక, యీ యన్నమాచార్యచరిత
వెఱవక నీకు నే విన్నవించెదను ;
మన్నించి యలమేలుమంగతో నీవు
నిన్నుఁ బాయని భక్తనికరంబుతోడ
నవధారు శ్రీవేంకటాచలాధీశ !
అవధరింపుఁడు గురుహరిభక్తులార ;