ఓంకారాక్షర యుక్తము చక్రము
|
సాంకమధ్యవలయాంతర చక్రము
|
సర్వ ఫల ప్రద సహజము చక్రము
|
పూర్వకోణసంపూర్ణము చక్రము
|
హరవిరించి దివిజాశ్రయ చక్రము
|
గురుగతి రెండవకోణపుఁ జక్రము
|
స్రావనిశాచర సంఘము చక్రము
|
కోవిదతృతీయకోణపుఁ జక్రము
|
రణభయంకరవిరాజిత చక్రము
|
గుణయత చతుర్ధకోణపుఁ జక్రము
|
హుంకారరవమ(హో)గ్రపుఁ జక్రము
|
కొంకనిపంచమకోణపుఁ జక్రము
|
ఫట్కార పర బ్రహ్మము చక్రము
|
షట్కోణాంత విశాపుఁ జక్రము
|
బహుళ పటహరవభైరవ చక్రము
|
మిహిర తుహినకరమిళితము చక్రము
|
కఠినపవనికరకల్పిత చక్రము
|
శఠమతఖండనచతురము చక్రము
|
దంభోళినఖరదారుణ చక్రము
|
గంభీరసమరకలితము చక్రము
|
చండమారుతవిసారిత చక్రము
|
కుండలీశముఖఘోషిత చక్రము
|
కాలదండశతకాండము చక్రము
|
జ్వాలానలముఖశౌర్యము చక్రము
|
విస్పులింగచయవిభ్రమ చక్రము
|
సాస్పాలితభుజహారము చక్రము
|
విద్యుత్కోటినివేశము చక్రము
|
ప్రద్యోతనమణిబంధము చక్రము
|
సంభ్రమసంభృతి సహజము చక్రము
|
బంభ్రమితవిదిక్పటలము చక్రము
|
భద్రగజప్రభుపాలన చక్రము
|
రుద్రైకాదశరూపము చక్రము
|
రక్షోగణగళ రక్తము చక్రము
|
భక్షితదుష్టప్రాణము చక్రము
|
కంఠనాధఘనగర్జిత చక్రము
|
లుంఠితతిమిరవిలోకన చక్రము
|
వజ్రాయుధబహు వర్షుక చక్రము
|
వజ్రమౌక్తికసువర్ణపుఁ జక్రము
|
బ్రహ్మాదిదివిజపాలన చక్రము
|
జిహ్మగభూషణజీవిత చక్రము
|
షోడశభుజసంషోభిత చక్రము
|
బాడబసహస్రబంధుర చక్రము
|
ప్రేంఖత్పరసు విభీషణ చక్రము
|
శంఖచక్రశరచాపము చక్రము
|
అసిగదాత్రిశూలాంకుశ చక్రము
|
ముశలపాశహలమోహన చక్రము
|
అగ్నిఖేటవజ్రాయుధ చక్రము
|
లగ్నకుంతశుభలక్షణ చక్రము
|
నేత్రత్రయవర్ణింతగరు చక్రము
|
రాత్రించరవిద్రావణ చక్రము
|
జ్వాలాకేశవిశాలపుఁ జక్రము
|
కాలకూటనిభకాంతుల చక్రము
|
అసిగదాత్రిశూలాంకుశ చక్రము
|
ముశలపాశహలమోహన చక్రము
|
అగ్నిఖేటవజ్రాయుధ చక్రము
|
లగ్నకుంతశుభలక్షణ చక్రము
|
ఘూర్ణమానమదగుంభిత చక్రము
|
నిఘ్నబాణకరనికరము చక్రము
|
విఘ్నాపహరణవిభవము చక్రము
|
విహ్వలితనరకవీరము చక్రము
|
సైంహికేయగళసంహర చక్రము
|
ముష్కరపౌండ్రనిమూలన చక్రము
|
దుష్కరకర్మవిధూనన చక్రము
|
నక్రకంఠదళనక్రమ చక్రము
|
ధిక్కృతతదనుజాతిక్రమ చక్రము
|
దుర్వాసస్సంస్తుత్యము చక్రము
|
శర్వరీశశతసంచయ చక్రము
|
త్రిపురవిజయకరతీవ్రము చక్రము
|
విపులనవరసనవీనము చక్రము
|
మంత్రాధిరాజమానిత చక్రము
|
యంత్రపీఠమధ్యాసిత చక్రము
|
కుంజరపాలనగుణయుత చక్రము
|
రంజితపుష్పపరాగము చక్రము
|
సంధ్యారుణపటసంవృత చక్రము
|
వంధ్యేతరగర్వస్ఫుట చక్రము
|
మిధ్యావాదతిమిరహర చక్రము
|
తధ్యామృతసంతర్పిత చక్రము
|
కల్హారమాలికాధర చక్రము
|
సిలధూపసంస్లిష్టము చక్రము
|
అర్కానలదీపాంచిత చక్రము
|
మార్కండేయనమస్కృత చక్రము
|
హవ్య కవ్య వివిధాశన చక్రము
|
దివ్యమునివరధ్యేయము చక్రము
|
వలయముమీదట వలగొను చక్రము
|
బలవదష్టదళపద్మపుఁ జక్రము
|
ఎడలగేసరము లెనసిన చక్రము
|
వడి నందుమీది వలయపుఁ జక్రము
|
షోడశదళముల సొంపగు చక్రము
|
వీడనికీసరవితతుల చక్రము
|
మొగిమూడువలయములుగల చక్రము
|
తగు భూగోళముఁ దనరిన చక్రము
|
అంగమంత్రముల నధికపుఁ జక్రము
|
జంగిలిపదాఱుస్వరముల చక్రము
|
అనఘచక్రగాయత్రిక చక్రము
|
తననిజ మంత్రముదగిలిన చక్రము
|
నరసింహమంత్రనామపుఁ జక్రము
|
ధర నక్షరములదామెన చక్రము
|
మహాసుదర్శనమంత్రము చక్రము
|
విహారితవజ్రవిధముల చక్రము
|
అంబర నరసింహాక్షర చక్రము
|
సాంబుజాక్షపాశాంకుశ చక్రము
|
మానితదిక్పతిమంత్రము చక్రము
|
నానావిధహరినామపుఁ జక్రము
|
వేయివిధంబుల వెలసిన చక్రము
|
వేయంచులుగల విశ్వపుఁ జక్రము
|
భావించు సుజనపాలన చక్రము
|
శ్రీ వేంకటపతి చేతిది చక్రము
|
శ్రీ కృష్ణార్పణమస్తు మంగళమహా శ్రీ శ్రీంజేయున్
|